కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ డ్రైవర్ అవార్డును అందుకుంటున్న పెండెం బాల్ నర్సయ్య
రాయల్ పోస్ట్ /ఆగస్టు16/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం

తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్టీసి బస్సు డ్రైవర్ పెండెం బాల నర్సయ్యకు ఉత్తమ అవార్డ్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా అందుకొన్నారు. ప్రజాదరణ,ఆర్టీసీ అధికారులు, డిపో డ్రైవర్ల మన్ననలు పొందిన వ్యక్తిగా యాదాద్రి డిపో లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.బస్సు సమయపాలన పాటించడం ద్వారా ప్రయాణికులకు భద్రత కల్పిస్తూ,సకాలములో గమ్యానికి చేరుస్తాడని డ్రైవర్ నర్సన్న అని తెలిపారు. గతంలో కూడా ఎన్నో అవార్డులు తెచ్చుకున్నా ఈ అవార్డ్ ప్రత్యేకమైనది అని 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ దినోత్సవంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మాట్లాడారు.