యాదాద్రి భువనగిరి జిల్లా

కలెక్టరేట్లో ఘనంగా జాతీయ గీతాలాపన……

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి/ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కలెక్టరేట్ లోని అన్నీ కార్యాలయాల అధికారులు , సిబ్బంది , పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు , విధ్యార్ధులు, సామూహిక జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఒకే సమయంలో నగర , పట్టణ , గ్రామ , ఆవాస కూడలలో , సినిమా హాలులలో అన్నీ వర్గాల వారు స్వచ్చందంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కృష్ణ రెడ్డి, పిడి డిఆర్డిఏ యం.ఉపేంధర్ రెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి , జిల్లా కొ-ఆపేరేట్యివ్ అధికారి పరిమళ దేవి , జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి పి.యాదయ్య , జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి , ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవిన్ కుమార్ , కలెక్టరేట్ ఏఓ నాగేశ్వరచారి , సిపిఓ మాన్య నాయక్, అందరూ జిల్లా అధికారులు, అన్ని కార్యాలయాల సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు , విధ్యార్ధులు, ఎక్సైజ్ సిబ్బంది , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.