75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలకు స్వతంత్రం రాలేదు
*పల్లగొర్ల మోదీరాందేవ్

రాయల్ పోస్ట్ న్యూస్/భువనగిరి విలేకరుల సమావేశం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో కోమండ్లపల్లి సంతోష్ కుమార్,అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్లగొర్ల మోదీ రాందేవ్ విచేసినారు వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న బీసీలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు ఈ దేశంలో 60 శాతం ఉన్న బీసీలు రాజకీయంగా ఉద్యోగ రంగాలలో పదిశాతం గిట్ల దాటలేదు బీసీలు,సమస్యలు చెప్పుకుందాం అంటే వినే నాధుడే కరువయ్యారు న్యాయ శాఖ జడ్జీలలో కూడా బీసీలు 7 శాతం దాటలేరు అట్టడుగు వర్గాల సమస్యలు అంటే ఈ ప్రభుత్వాలకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు గానే ఉన్నది ఉమ్మడి రాష్ట్రం కానుంచి ఇప్పటి వరకు బిసి సీఎం లేకపోవడం దౌర్భాగ్యం బీసీలు జెండాలు మోసే టందుకు జేజేలు కొట్టడానికి మాత్రమే పనికి వస్తారా, అధికారంలో వాటాదారులగా ఎస్సీ ఎస్టీ బీసీలు పనికి రారా దేశ రాష్ట్ర బడ్జెట్లలో బీసీలకు ఒక్క శాతం నిధులుకూడా కేటాయించకపోవడం దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులు ఎస్సీ ఎస్టీ బీసీలకు చాయ్ బిస్కెట్ సరిపోతలేవు బహుజనులను ఈ ప్రభుత్వాలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా పరిగణిస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో వాటాదారులుగా పరిగణిస్తారులేరు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు విదేశీ ఓవర్సీస్ కాలర్ షిప్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి నిరుద్యోగ భృతి అని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెఎక్కాక నిరుద్యోగ సమస్య ఊసేలేదు ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 2021 జనాభా లెక్కలలో కులగణన తీయాలి అసెంబ్లీ పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో జటంగి మహేష్,7 మేక లక్ష్మణ్ యాదవ్, పట్వారి శశాంక్, బచ్చు సాయి, రవితేజ, మహేష్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు