రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి, మల్లారెడ్డి నారాయణరెడ్డి ఆసుపత్రి, చావా ఫౌండేషన్ వారి సౌజన్యంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్కె ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ రాజ్ కుమార్, రోటరీ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాన్ని తొందరగా కోల్పోతామని చెప్పారు. పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ,ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. క్లబ్ కార్యదర్శి కరిపె నర్సింగరావు .సర్పంచి ఏదునూరి ప్రేమలత, ఎంపిటిసి సభ్యురాలు గునుకుంట్ల కల్పన, ఉపసర్పంచి మైలారం వెంకటేష్, మాజీ గవర్నర్ తిరునగరి, రంగయ్య, అసిస్టెంట్ గవర్నర్ జ్ఞాన ప్రకాష్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ గవర్నర్ శెట్టి బాలయ్య యాదవ్, సభ్యుడు మోహన్ రెడ్డి ,రంగయ్య, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ బండారు జయశ్రీ, మల్లేశం, కృష్ణ, బి శ్రీను, వెంకటేష్ అశోక్ పాల్గొన్నారు ఈ శిబిరంలో రేడియాలజిస్టు డాక్టర్ బ్యుల , డెంటిస్ట్ డాక్టర్ విష్ణు ప్రియ, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజరి , డాక్టర్ రాజకుమార్, డాక్టర్ ఆశ్లేష, సిబ్బంది పాల్గొన్నారు
ఈ శిబిరం లో 285 మందికి వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. క్యాన్సర్ వ్యాధిగా గుర్తించిన వారిని హైదరాబాదులో ఉచితంగా తగిన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ శిబిరములో 1.80crore విలువగల క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఏర్పాటు చేయబడింది.
బండారు శ్రీనివాస్ రావు అధ్యక్షులు*
కారిపే నర్సింగరావు కార్యదర్శి
భోగ హరికిషన్ కోశాధికారి