ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవ తిరంగా బైక్ ర్యాలీ
ముఖ్య అతిధిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవాల,సందర్భంగా స్థానిక హైదరాబాద్ చౌరస్తా నుండి,రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు ముస్లిం సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలనుసైతంఅర్పించారని,భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశంలో లౌకిక సంఘాలు కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా జీవిస్తున్నామని అన్నారు.అలాగే అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సంఘాలు కూడా హర్ ఘర్ పర్ తిరంగా జాతీయ జెండాను ఎగురావేయాలని స్వతంత్రం వచ్చిన 75సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందనిఅన్నారు.
అలాగే అడ్వకెట్ రహీం మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరునంలో మహా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందనిఅన్నారు ప్రతి ఒక్కరు కూడ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశి దేశభక్తిని చాటలని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు. వైస్ చైర్మన్ కిష్టయ్య, అడ్వకేట్ ఎం ఏ రహీం
ఎండీ సాజిద్,ఎండీ ఇక్బాల్ చౌదరీ,ఎండీ జావీద్ ఖాద్రి ఎండీ ఇంతియాజ్,అమీన్ మెమన్,మౌలానా అహేమద్
మౌలానా ఇమాద్,
ఇక్బాల్ చౌదరీ
సాజిద్,ఎండీ ఇస్మాయిల్ ఖాజా అజీమోద్దీన్
అతహర్,జావీద్ ఖాద్రి ఫారోక్,జలీల్,ఎండీ తాహేర్ సలవొద్దీన్,ఎండీ కాజమ్
ఎండీ ఇస్తియాక్,
ఎండీ వసీమ్,ఎండీ ముబీన్
ఎండీ అమీరొద్దీన్ ఎండీ అమానత్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు