కెసిఆర్ పాలననూ అంతం చేయడమే బిజెపి లక్ష్యం
:-బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

గుండాల ఆగస్ట్ 14(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లాలో బిజెపి పార్టీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర గుండాల మండల కేంద్రం నుండి బండ కొత్తపెళ్లి వరకు సాగింది మొదటగా గుండాల మండల కేంద్రంలోని గ్రంధాల ఆవరణలో మహాత్మా గాంధీ కి పాలాభిషేకం చేసి దండలు వేసి పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నైజం నవాబుల పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకు తింటున్నడని కెసిఆర్ ను తమిరికొట్టే సమయం ఆసన్నమైందని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు లేక యువత గగ్గోలు పెడుతున్నారని ఎన్నికల ముందు నిరుద్యోగ నిర్మూలన చేస్తాను అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదు ఉద్యోగాలతో తన ఇంట్లో మాత్రం నిరుద్యోగ నిర్మూలన విజయవంతంగా చేసి
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఉప ఎన్నికలు వస్తేనే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందని లేదంటే ప్రజా సమస్యలను పట్టించుకోరని అన్నారు.ఆలేరు నియోజక వర్గంలో గుండాల మండలం ఎలాంటి అభివృద్ధి చెందలేదని అన్నారు. ఈ ప్రాంతంలో ఏ ఒక్క బీదవారికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన దాఖలాలు లేవని వివరాలు తానే స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వి అర్ ఏ ల సమ్మె కొనసాగుతున్నా వాళ్ళని పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు అని అన్నారు. ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మా సమస్యలు పరిష్కరించాలని ఎంపి బండి సంజయ్ కి వినతి పత్రం సంఘం అధ్యక్షుడు పొడిషెట్టి వెంకన్న అందజేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో రామరం గ్రామ మాజీ సర్పంచ్ బబ్బురి సుధాకర్ గౌడ్ తోపాటు వందమంది కార్యకర్తలను జైన్ చేయించాడు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పీవి శ్యాంసుందర్,కాసం వెంకటేశ్వర్లు,మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, దాసరి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.