సెక్యులర్ దేశంలో మతచిచ్చు సహించబోము….. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరీ గారి ప్రీతం

రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్ /స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మూడవరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లోని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మీదుగా టి పి సి సి ఎస్ సి విభాగం అధ్యక్షులు నా గరిగారి ప్రీతం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 70 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రంలో నేడు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరిని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కలుపుకోయే పార్టీ సెక్యులర్గా ముందుకు పోయే పార్టీ , ఈరోజు భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నా అది బిహెచ్ఎల్ గానీ, రైల్వేస్ గాని, ఎన్నో ప్రభుత్వ సంస్థలను ఆనాడే కాంగ్రెస్ పార్టీ సంస్థలను స్థాపించి భారతదేశ భవిష్యత్తును ఆరోజు నిశ్చయించారని తెలిపారు. కానీ నేడు భారతదేశంలో మరియు ముఖ్యంగా ఈ బిజెపి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మేల్కొల్పి ఇలాంటి ప్రభుత్వాల చర్యలను అరికట్టేందుకు మేము ప్రయత్నిస్తామని అన్నారు. అలాగే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మేము మీ ముందుకు యువకుడిగా మరియు నాతోటి యువ సోదరులు రేమండ్ ,మైఖేల్, నరేష్, మేమందరం ఈరోజు బాబాసాహెబ్ విగ్రహం ఎదుట ఆయన కాళ్ల దగ్గర కూర్చొని మేము ఒక శపథం తీసుకుంటున్నాం ఈ భారత దేశంలో ఎవరైతే మమ్మల్ని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారో, వాళ్లని ఈ భారతదేశం నుండి తరిమికొట్టే ప్రయత్నం చేస్తామని, ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు రోజుల నుండి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర ఏ విధంగా జరీగిందో మీకు తెలుసు, ఈ యాత్రలు అద్భుతంగా సాగింది ప్రజలు కాంగ్రెస్ పట్ల హర్షిస్తున్నారు, ప్రేమను వ్యక్తపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ పార్టీ హయంలో నే 75 సంవత్సరముల ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే అది కంటోన్మెంట్ ప్రాంతంలో జరుపుకోవడం అంటే చాలా అదృష్టమని భావిస్తున్నామని తెలిపారు. అలాగే ఏడవ వార్డు కాంగ్రెస్ నాయకులు రేమండ్ హార్ట్ వుడ్ మాట్లాడుతూ మా కాంగ్రెస్ పార్టీ నాయకుని కోసం మేమెప్పుడూ వారి వెన్నంటుండి నడుస్తామని తెలిపారు అలాగే వారి సమక్షంలో ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు ఆజాద్ కి గౌరవ యాత్ర తీయడం మేము సంతోషంగా భావిస్తున్నామని అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గెలవడానికి మా వంతు ప్రయత్నం తెలిపారు. 8వ వార్డు బొల్లారం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహన్,కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి అరవింద్ నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించడం జరిగినది యాత్రలో అది సంఖ్యలు ప్రజలు కాంగ్రెస్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే తిరుమలగిరిలొ ఆజాదీకి గౌరవ్ పాదయాత్రలో 7 వ వార్డు మైఖేల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాయకత్వంలో, నరేష్ కాంగ్రెస్ నాయకులు ,హరి, డెంజిల్, కార్తీక్ ,అమూల్, ప్రమోద్ ,డేవిడ్ ,అరుణ్, కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.