ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాఖీ కట్టిన విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి

రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్ /శుక్రవారం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కేసీఆర్ ) గారికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గౌరవ శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు రాఖీ కట్టారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సాయంత్రం ముఖ్యమంత్రిని ఆమె
కలిశారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి గారికి సంప్రదాయబద్దంగా బొట్టు పెట్టి, రాఖీ కట్టి ఆశీస్సులు పొందారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ – శోభ గార్ల దంపతులు విప్ సునీతామహేందర్ రెడ్డి గారిని అభినందించారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. మహిళా

సంక్షేమం, సాధికారతకు టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాజకీయంగా ప్రోత్సహిస్తూ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను పెంచామన్నారు. ఒక పక్క ఉద్యోగ, పారిశ్రామిక రంగం, స్వయం ఉపాధి కల్పనకు పాటుపడుతూ, మరో పక్క మహిళల రక్షణకు షీ టైమ్స్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పాటు ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందిస్తుందని ఆమె చెప్పారు.