కంటోన్మెంట్ లో కదం తొక్కిన కాంగ్రెస్

రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్ /స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రెండవ రోజు మల్కాజ్ గిరి పార్లమెంట్ లోని కంటోన్మెంట్ నియోజకవర్గం లోని కార్ఖానా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా (Ward-3), కార్కానా విక్రంపురి కాలనీ (Ward -5), లక్ష్మీ నగర్ పికెట్. జేబీఎస్ బస్టాండ్ (Ward -4) మీదుగా టీపీసీసీ యస్సి విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారి ఆధ్వర్యంలో ఆజాదికి గౌరవ్ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బద్దం బల్వంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్వేల్ భరత్ గారు , సయ్యద్ రియాజుద్దీన్ గుడ్డు అష్రఫ్ గారు, జమీల్ గారు, మురళి గారు, శాంసన్ రాజు గారు, నరసింహన్ గారు, వెంకటేష్ గారు గ్రేటర్ హైదరాబాద్ యస్సి విభాగం చైర్మన్ అచ్యుత్ రమేష్ బాబు గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు పత్తి కుమారుగారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు .