రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా చేగుంట

స్నేహితుల దినోత్సవం వేళ
కలుసుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు

పదవ తరగతి పూర్తయి అప్పుడే 33 సంవత్సరాలు గడిచిపోయాయి. 33 సంవత్సరాల అనంతరం పదవ తరగతిలో చదువుకున్న విద్యార్థులు అందరూ ఒక్క చోట చేరి ఆనాటి అనుభూతులు అనుభవాలను నెమరేసుకున్నారు. అలనాడు విద్యా బుద్ధులు  బోధించిన ఉపాధ్యాయులను పిలిపించి వారి సమక్షంలో వారు చేసిన చిలిపి చేష్టలు అల్లరిని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1988 -89 బ్యాచ్ విద్యార్థులు ఒకచోట చేరి అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో అపూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో పాల్గొని సందడి చేశారు. 33 సంవత్సరాల క్రితం పదో తరగతి చదివిన విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు. ఉపాధ్యాయులను శాలువాలు మెమేంటోలతో ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమౌళి, ఉపాధ్యాయులు కరణం నరసింహులు,శంకరయ్య, గోవర్ధన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో పావని, వెంకట్ గౌడ్, లక్ష్మణ్, చరణ్, టి రాజు, గర్దాస్ కేశవరావు,శ్రీనివాస్ గౌడ్,ఆంజనేయులు, వినోద,వాణి, పద్మ, ఇఫ్తికార్ అహ్మద్, బోయిన భూషణం, కామారం రాజేశ్వర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.