మహిళల మరియు బాలల సహాయ భరోసా సెంటర్ ప్రారంభం

రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా ప్రతినిధి

మెదక్ పట్టణం లోని ప్రభుత్వ దవాఖన సమీపంలో ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా భరోసా సెంటర్ ను ప్రారంబించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ డా బాలస్వామి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో మెదక్ జిల్లా యందు షీ టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయని భరోసా-సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ మరియు చిల్డ్రన్ అనేది హింసకు గురి అయిన మహిళలకు,ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో,కుటుంబంలో,సంఘంలో,మరియు కార్యాలయంలో,మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడిందని, మహిళలకు శారీరక,లైంగిక,భావోద్వేగ,మానసిక వయస్సు,తరగతి,కులం,విద్యా స్థితి,వైవాహిక స్థితి, జాతి వంటి వాటిలో ఎలాంటి సంబంధం లేకుండా వారికి సమస్యలను పరిష్కరిస్తుంది. లైంగిక వేధింపులకు ప్రయత్నించడం, లైంగిక వేధింపులు,ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు భరోసా కేంద్రంలో ప్రత్యేక సేవలు అందించబడతాయని
ఈ భరోసా సెంటర్లో సెంటర్ కో- ఆర్డినేటర్, మరియు సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్ ,లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఏ.ఎన్.ఎం) ,డాటా ఎంట్రీ ఆపరేటర్, మరియు అకౌంటెంట్, రిసెప్షనిస్టులతో భరోసా సెంటర్లో సేవలు అందించడం జరుగుతుందని, అలాగే మహిళల రక్షణ గురించి మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో “భరోసా” కేంద్రంను మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా భరోసా సెంటర్ ను ప్రారంబించడం జరిగిందని అన్నారు. అత్యాచార బాధితులు,మహిళలకు అండగా భరోసా కేంద్రం పనిచేయునుందని. 24 గంటల పాటు మహిళా పోలీసులు అందుబాటులో బాధితులకు భరోసా ఇస్తారని ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తున్న ఈ కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. మోసపోయిన బాధితులు మళ్లీ వంచనకు గురికాకుండా చూడటం, వారికి తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని ప్రస్తుతం ఫోక్సో మరియు క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కు సంబంధించిన కేసులలో సత్వర న్యాయం చేయుట కొరకు భరోసా సెంటర్ కి బదిలీ చేయడం వలన మెడికల్ ఎగ్జామినేషన్, బాధితురాలి వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించడం,164 c.r.p.c స్టేట్మెంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయడం, బాధితురాలికి షెల్టర్ ఇవ్వటం వంటివి కల్పించడం చేయవచ్చని అన్నారు. తద్వారా బాధితురాలు పోలీస్ స్టేషనులకు పదేపదే తిరగాల్సిన అవసరం ఉండదని వారు కూడా తమకు భరోసా కల్పించే అధికారులతో మనసు విప్పి జరిగిన అన్యాయాన్ని వివరించగలుగుతారని చాలామంది బాధితురాళ్లు తమకు ఎదురైన సమస్యను పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయుటకు భయపడుతూ ఉంటారని అటువంటి వారికి అండగా నిలిచేదే భరోసా కేంద్రం అన్నారు.
భరోసా సెంటర్లో మహిళలకు అందించే సేవలు
*భరోసా సెంటర్ 24 గంటలు సేవలను అందిస్తుందని
*భరోసా కేంద్రంలో పోక్సో లైంగిక నేరాల, రేప్ కేసులతో సంబంధిత బాధితులకు భరోసా కల్పిస్తుందని
*భరోసా తక్షణ వైద్య సహాయం అందిస్తుందని
*FIR నమోదు దశ నుండి, కోర్టులో తుది పరిష్కారానికి సంబంధించిన ప్రతి కేసుల్లో భరోసా చట్టప్రకారం సహాయాన్ని అందిస్తుందని,

 • బాధితులను భరోసా సి.డబ్ల్యు.సి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరపరచడం జరుగుతుందని .
 • బాధిత అమ్మాయి/ మహిళల వివరాలను గోప్యంగా ఉంచుతుందని
  *భరోసా సెంటర్ నందు బాధితుల యొక్క161 c.r.p.c స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుందని,
 • సంబంధించిన బాధితులకు ఏమైనా మానసిక సమస్యలు ఉన్నట్లయితే, బాధితులను మానసిక రోగి చికిత్స /మనస్తత్వవేత్త (నిపుణుల) వద్దకు పంపడం జరుగుతుందని .
  *బాధితురాలికి తాత్కాలికంగా మరియు అత్యవసర ఆశ్రయం అవసరమైతే సఖి కేంద్రానికి పంపివ్వడం జరుగుతుందని.
  *భరోసా సెంటర్లో యుక్త వయసులో ఉన్న బాలికలు, అబ్బాయిలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని
  *బాధితులకు కౌన్సిలింగ్ మరియు బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి భరోసా సెంటర్ వారి యొక్క గ్రామాలకు వెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిసిపిఓ శ్రీమతి కరుణశీల, సఖి లీగల్ అడ్వైజర్ జకీర్ ఉన్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆరవ వార్డు కౌన్సిలర్ రాగి వనజ అశోక్, మెదక్ డిఎస్పి సైదులు, పట్టణ సీఐ శ్రీ.మధు, ఎస్బి సి.ఐ నవీన్ బాబు, ఎస్సై సందీప్ రెడ్డి, మహిళా ఎస్.ఐ. నాగరాణి, మెదక్ పట్టణ కానిస్టేబుల్ రాజు పిసి1500 గారు, భరోసా సెంటర్ ఇంచార్జ్ రేణుక, మరియు సిబ్బంది పాల్గొన్నారు.