ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభం

ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభం పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్/ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కేసీఆర్ ) ఘనంగా ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్ హెచ్ ఐ సీసీ లో జరిగిన ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు MLA శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా హారాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ సునీతామహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం, ఎంతో మంది యోధుల త్యాగం వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారందరి జీవితం స్పూర్థిదాయకమన్నారు. ప్రతి ఇంటా జెండాను ఎగురవేసి దేశ కీర్తిని చాటాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర పాలన సాగుతుందని విప్ సునీతామహేందర్ రెడ్డి మరోమారు తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, గుట్ట, ఆలేరు మున్సిపల్ చైర్మన్లు ఎరుకల సుధా, వస్పరి శంకరయ్య, ఆయా మండలాల జడ్పీటీసీ లు లక్మి, తోటకూరి అనురాధ, పల్లా వెంకట్ రెడ్డి, ఎంపీపీ లు భూక్య సుశీల సుదీర్ రెడ్డి,అమరావతి జడ్పీ కో- ఆప్షన్ కలీల్ గారు తదితరులు పాల్గొన్నారు.