కౌడిపల్లి మండలం దేవులపల్లిలో విషాదం.లైవులో పురుగుల మందు తాగిన యువ రైతు

రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రతినిధి

ఓ రైతు పురుగుల మందు తాగిన ఘటన కౌడిపల్లి మండలంలోని దేవులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు లైవ్ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం దేవులపల్లి గ్రామానికి చెందిన యువ రైతు జింక శ్రీశైలం తన 5 ఎకరాల పొలంలో మిరప పంటను వేసాడు.పల్లె ప్రకృతి వనం కోసం గ్రామ సర్పంచ్,ఫారెస్ట్ అధికారులు జేసిబి సహాయంతో తను లేని సమయంలో ఆ పొలాన్ని దున్నేశారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగాడు.తమ తాతలు తల్లితడ్రుల నుండి ఆ పొలాన్ని సాగుచేస్తున్నామని,తన తల్లి అమాయురాలని ఆమెకు ఏమి తెలియదని,తనకేమన్న జరిగితే పూర్తి బాధ్యత సర్పంచ్,ఫారెస్ట్ అధికారులదేనని తనకు ఒక పాప,బాబు ఉన్నారని వాళ్ళకన్నా న్యాయం చేయాలని వేసుకుంటూ పురుగుల మందు తాగాడు.కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తమై మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.