మెదక్ ఎమ్మెల్యే కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం

రాయల్ పోస్ట్ న్యూస్/ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాదినందున పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. శనివారం నాడు మెదక్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మురళీయాదవ్ తన మనసులో వేరే ఆలోచనతోనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ మురళి యాదవ్ కు సముచిత స్థానం కల్పించింది. తన భార్య కు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ పదవి,అతనికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి, ఇప్పుడు తనకు మున్సిపల్ చైర్మన్ పదవులు కట్టబెట్టింది. ఎవరిని సంప్రదించకుండా మాట్లాడటం సరికాదు. ఈ మీడియా సమావేశంలో మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షుడు యం. గంగాధర్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మెన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,మెదక్, కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ లు సి హెచ్ హనుమంత్ రెడ్డి,అందె కొండల్ రెడ్డి,నాయకులు రాగి అశోక్, లింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.