కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అద్దంకి దయాకర్ బే షరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మ దగ్ధం

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో బర్రె జాంగిర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పట్ల చండూరు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతున్న మాటలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న వేదిక మీదనే అన్ పార్లమెంటరీ పదాలతో, పొమ్మన లేక పొగబెట్టే రెచ్చగొట్టే మాటలు నాయకుల ప్రోత్సాహానికి నిదర్శనంగా ఉన్నదని కరుడుగట్టిన కాంగ్రెస్ వాది నికాసైన కాంగ్రెస్ పార్టీ అభిమాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పట్ల అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే భే షరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని లేదా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆశయాల కోసం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడుగా నాలుగు పర్యాయాలు శాసనసభ్యునిగా మంత్రిగా నేడు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిబద్దతో సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఎన్ఎస్ఈఐ యువజన కాంగ్రెస్ అనుభవంతో 30 సంవత్సరాలకు పైగా పేద ప్రజలకు నిస్వార్ధంగా నిస్సంకోచంగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలకు విద్యార్థి నిరుద్యోగ యువకులకు సొంత డబ్బులతో కృషి చేసిన నాయకుడు అద్దంకి దయాకర్ కూడా ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకున్న 2014లో 2018లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే నీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ నీకు అన్ని రకాలుగా రెండు ఎన్నికలలో ఆర్థికంగా సహకరిస్తే డబ్బులు ఖర్చు పెట్టకుండా నువ్వు ఓడిపోయి కార్యకర్తలకు మమేకం కాకుండా కార్యకర్తల కష్టనష్టాలను పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గం లో నువ్వు చేయకపోగా ఎన్నికల అప్పుడే నియోజకవర్గానికి వచ్చే నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకునిగా స్థానిక పార్లమెంట్ సభ్యునిగా సమాచారం లేకుండా కొంతమంది తమ ఇష్టారాజ్యంగా అవమానపరుస్తూ తన పార్లమెంట్ పరిధిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నాయకులను అడిగేది పోయి మైకు దొరికితే సినిమా యాక్టర్ లాగా డ్రామా కంపెనీ లాగా నోటికి వచ్చినట్టు కొంతమంది నాయకుల మెప్పు పొందడం కోసం అన్ పార్లమెంటరీ పదాలు వాడని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఖండిస్తూ అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఈరపాక నరసింహ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా గిరీష్ కుమార్ యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ముత్యాల మనోజ్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యాస్ చిన్న అందే నరేష్ మల్ల రెడ్డి బింగి నరేష్ నవీన్ మల్లేష్ సిద్ధార్థ మనోహర్ ఎన్ఎస్ఐ జిల్లా కార్యదర్శి సిరి పంగ చందు సాయి నిఖిల్ శివ రామకృష్ణ పల్లరా నరసింహ దర్గాయి దేవేందర్ ఇమ్రాన్ ఇర్ఫాన్ లింగం శరత్ యాదవ్ నితిన్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది