ఏఐసీసీ పిలుపు మేరకు పెంచిన ధరలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసన,రాస్తారోకో

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు జిఎస్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించకుండా నిర్లక్ష్యం వివరిస్తున్న వైఖరికి నిరసనగా బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో నిరసన రాస్తారో నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిత్యవసర సరుకుల ధరలు అస్తవ్యస్తంగా చిన్న భిన్నంగా చేశాయని బతుకు భారమై పేద ప్రజలను పూట గడవని పరిస్థితులలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా గమనించాలని, విద్యార్థులు చదువుకోవాలన్న విద్యా సామాగ్రి పైన కూడా జిఎస్టి మోపి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ నిరుద్యోగులకు గత ఏడు సంవత్సరాలు నుండి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పీజీ పట్టాలు చేత పట్టుకొని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ఉన్నటువంటి భారతదేశాన్ని అధోగతి పాలు చేసిన కేంద్ర ప్రభుత్వాల వైఖరినీ ప్రజలంతా చూస్తున్నారని, ధనవంతుల చెంత చేరి ఆదాని అంబానీ లకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తూ పేద ప్రజల జీవితాలపై అధిక భారం మోపుతున్న ఈ ప్రభుత్వాలను గద్దే దింపేంతవరకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్ ఈరపాక నరసింహ, సలావుద్దీన్, కోల్ల దుర్గాభవాని గంగాధర్, జిల్లా కాంగ్రెస్ ఎస్సి విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు మంగ ప్రవీణ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మజార్ పాష బబ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు కొల్లూరి రాజు అందె నరేష్, దర్గాయి దేవేందర్, గ్యాస్ చిన్న, కబీర్, లింగం హరిరాజు, తదితరులు పాల్గొనడం జరిగింది