టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ” బండి ” – ” గుండు ” కొట్టించుకుంటాడా ?

● యాదాద్రి ఆలయ నిర్మాణానికి కేంద్రం ఒక్క రూపాయి కేటాయించిందా?
● వాసాలమర్రి లే అవుట్ పూర్తి
● 99 శాతం దళిత బంధు యూనిట్ల పంపిణీ
● నిఖార్సయిన హిందువు సీఎం కేసీఆర్
● భిక్షమయ్య గౌడ్ మాటలు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది
● ఆయన సొంతూరికి రోడ్డు వేసింది టిఆర్ఎస్ సర్కారే
● విలేకరులతో ఎన్ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

● బీజేపీ యాదగిరిగుట్ట బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అంటూ వ్యాఖ్యలు

రాయల్ పోస్ట్ న్యూస్/టిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపడితే ఇదే బండి, యాదాద్రి నృసింహుడి సన్నిధిలో గుండు కొట్టించుకుంటాడా ? అని టెస్కబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గౌరవ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు సవాల్ విసిరారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యాదగిరిగుట్టలో బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు. భువనగిరి, సూర్యాపేట, జనగామ, బోధన్ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించినా.. కేవలం రెండున్నర ఎకరాల్లోని సభా ప్రాంగణం నిండలేదన్నారు. ఈ సభతో స్థానికంగా బీజేపీకి ఆదరణ లేదనే విషయం స్పష్టం అయిందన్నారు. విష్వఖ్యాతి చెందేలా రూపుదాల్చిన యాదాద్రి ఆలయ పునర్నిర్మానాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ తన కరీంనగర్ లోని వేములవాడ ఆలయానికి ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి మంజూరు చేయించారా ? అంటూ నిలదీశారు. పూర్తి స్థాయిలో కృష్ణశిలాలతో నిర్మితం అయిన ఏకైక ఆలయ యాదాద్రి అని చెప్పారు. బీజేపీ తమ స్వార్ధ రాజకీయాల కోసం మతాలను వాడుకుంటూ సామాన్యు ప్రజలను రెచ్చగొట్టడం దుర్మార్గం అని అన్నారు. ఇటు యాదాద్రి, అటు భద్రాద్రి, వేములవాడ ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నిజమైన హిందువు సీఎం కేసీఆర్ అని పునర్దుటించారు. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో నూతన గ్రామ పునర్నిర్మాణ లేఅవుట్ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 99 శాతం దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశామని వివరించారు.

● భిక్షమయ్య గౌడ్ మాటలు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉన్నాయి

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అని, ఆయన మాటలు దొంగే.. దొంగ అన్న చందంగా ఉన్నాయని గొంగిడి మహేందర్ రెడ్డి గారు అన్నారు. పలు భూ కబ్జాల కేసులో భిక్షమయ్య గౌడ్ జైలుకు వెళ్లిన మాట వాస్తవం కదా ? ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరగడం లేదా ? అని ప్రశ్నలు సంధించారు. ఆయన సొంత గ్రామం పారుపల్లి ( గుండాల మండలం ) గ్రామానికి రోడ్డు వేసిన ఘనత గౌరవ శ్రీమతి గొంగిడి సునీత గారికే దక్కిందన్నారు. ఆమె కృషితోనే వందల కోట్ల రూపాయలతో రహదారులు అద్దంలా మారాయని వివరించారు.

● కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాము

యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి గౌరవ శ్రీ కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పేలిమెల్లి శ్రీధర్ గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహెమేందర్ గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు మిట్ట వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.