వాటర్ రావటం లేదని?వాటర్ మ్యాన్ ని ప్రశ్నిస్తే.?.ఓ యువకుడి పై దాడి చేసిన ఆ ఊ రి వాటర్ మ్యాన్….

రాయల్ పోస్ట్ న్యూస్/ ఈ సంఘటన తుర్కపల్లి మండలం నాగయపల్లి గ్రామం నాగయపల్లి తండాలో చోటు చేసుకుంది.గ్రామానికి సంబంధించిన వాటర్ ట్యాంక్ కింద వాటర్ మ్యాన్ వాటర్ ప్లాంట్ నడిపిస్తున్నారు…

ఈ వాటర్ ప్లాంట్ ప్రజలందరికోసం గతంలో బిక్షమయ్యా గౌడ్ ఇచ్చారు..ఈ వాటర్ ప్లాంట్ లో ఒక్క క్యాన్ 5 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 10రూపాయలకు ఒక క్యాన్ అమ్ముతున్నాడు..

అదే విధంగా తన వాటర్ ప్లాంట్ కి వాటర్ సరిపోవని ,గ్రామానికి వాటర్ ఇవ్వటం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు…

కాగా ఈరోజు గ్రామంలో వాటర్ లేవని అడిగితే గ్రామానికి చెందిన ప్రవీణ్ నాయక్ పై ఆ వాటర్ మ్యాన్ దాడి చేశాడు.

దాడి చేయడం తో ప్రవీణ్ అనే యువకుడి చేయి గాయం అయింది,దీంతో ప్రవీణ్ అనే యువకుడు తన పై దాడి చేసిన వారి పై తుర్కపల్లి మండల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.