గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి…

రాయల్ పోస్ట్ న్యూస్/గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పగిడిపల్లి గ్రామంలో సుమారు 65 సంవత్సరాల వయసుగల భిక్షాటన చేసే వ్యక్తి నేషనల్ హైవే 163 రోడ్డును దాటే సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కాగా గుర్తుతెలియని వాహనం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై హెచ్ రాఘవేందర్ గౌడ్ తెలిపారు.