కమాన్ రోడ్డు హామీపై నిలదీసిన 35 వార్డుకౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీ వాణి

రాయల్ పోస్ట్ న్యూస్/ భువనగిరి
గత మున్సిపల్ సమావేశంలో 35 వ  వార్డు ఆర్.బి నగర్ కమాన్ రోడ్ నిర్మాణానికి త్వరలోనే పరిష్కరిస్తామని సమావేశంలో ఇచ్చిన హామీ పాలకులు విస్మరించారని కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి జరిగిన మున్సిపల్ సమావేశంలో నిలదీశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని మున్సిపల్ సమావేశాలు నిర్వహించడం వల్ల పట్టణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.
స్థానిక శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డికి సమస్యను వివరించి పరిష్కరిస్తామని సమావేశంలో హాల్లో ఇచ్చిన మాటకు విలువ లేదా అని ప్రశ్నించారు.
ప్రతిసారి  సమస్య ను పరిష్కరించాలనే ఎమ్మెల్యే  స్థానికంగా లేరని కుంటి సాకులు చెప్పడం ఒక రివాజ్ గా మారిందని అన్నారు.  మున్సిపల్ సమావేశంలో ఆర్బీ నగర్ కమాన్ రోడ్డుపై హామీలు ఏమయ్యాయి అని నిలదీశారు. కబ్జాకోరులు సభ్యుల పైన కేసులు నమోదు చేస్తున్న పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు.
రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసినప్పటికీ నిర్మాణ పనులు ఆగటం లేవని అధికారులు చూచి చూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని అన్నారు. వెంటనే ఆర్ బి నగర్ కమాన్ రోడ్ సమస్య పరిష్కారానికి  శ్వాషిత  పరిష్కారం కోసం పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 35 వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి తెలిపారు.