కారు స్టీరింగ్ MIM చేతిలో ఉంది.. @పి.వి

భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ శాఖ సమావేశం బిజెపి భువనగిరి పట్టణ అధ్యక్షులు శ్రీపాదరాజు ఉమా శంకర్ రావు రాయల్ పోస్ట్ న్యూస్/ అధ్యక్షతన పట్టణంలోని MNR గార్డెన్ లో జరిగినది.ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ పి.వి. శ్యాంసుందర్రావు బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఇన్చార్జ్ శ్రీ నాగు రావు నామాజి విచ్చేసి మార్గదర్శనం చేసినారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆగస్టు 2వ తేదీన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు తీసుకుని మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టబోతున్నారని,మొదటి రోజు యాదగిరిగుట్టలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు అందులో భాగంగా భువనగిరి పట్టణం నుండి పెద్ద ఎత్తున బహిరంగ సభకు బిజెపి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక నియంత ప్రభుత్వం కొనసాగుతుందని,ప్రజా శ్రేయస్సు మరచి కేవలం ఆస్తులు ఎలా కూడబెట్టుకోవాలో, కబ్జాలు ఎలా చేయాలో ఆలోచనలో ఉన్నారని అన్నారు,కేసీఆర్ పాలన మరో నిజాం పాలనను తలపిస్తుందని,వాస్తవానికి కారు స్టీరింగ్ MIM పార్టీ చేతుల్లో ఉందని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రజలకు సేవ చేయడం యాది మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా గడుపుతున్నారని అన్నారు.భువనగిరి ప్రాంతంలో హామీలు ఇచ్చి ఎమ్మెల్యే గెలిచినవ్ .నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని అమలుకు నోచుకున్నాయో సమాధానం చెప్పు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీని బొందపెడుతారని అన్నారు.కార్యకర్తలు అంత కంకణ బద్ధులై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ నంద కుమార్ యాదవ్ ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పోతంశెట్టి రవీందర్ ,శ్రీ పాశం భాస్కర్ గ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నర్ల నర్సింగ రావు ,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చందా మహేందర్ గుప్తా ,నీలం రమేష్ ,బిజెపి జిల్లా కార్యదర్శులు కొండం ఉపేందర్ గౌడ్ ,శ్రీమతి జనాగం కవిత నర్సింహ చారి ,పంచెద్దుల బలరాం ,మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సుర్వి లావణ్య ,కాన్సిలర్లు శ్రీమతి ఉదరి లక్ష్మీ సతీష్ ,శ్రీమతి నల్లమాస సుమ వెంకటేశ్వర్లు ,బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు బద్దం బాల్ రెడ్డి ,ఉడుత భాస్కర్ ,మరియుబిజెపి పట్టణ నాయకులు,వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.