స్థానిక సంస్థలలో బ్యూరో కాట్ల పెద్దరికం ని తగ్గించాలి
పట్టణ ప్రజలు పన్నుల రూపేనా కట్టిన ప్రతి పైసా ను ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఖర్చు చేయాలి
పోత్నక్ ప్రమోద్ కుమార్
రాయల్ పోస్ట్ న్యూస్/ భువనగిరి పురపాలక సంఘం చైర్మన్ అధ్యక్షత జరిగిన సాధారణ సమావేశంలో వార్డుల అభివృద్ధి కన్నా ప్రభుత్వ కార్యాలయాలు మరియు కలెక్టరేట్ల అవసరాల కోసం మున్సిపల్ మున్సిపల్ సాధారణ నిధులను ఖర్చు చేయడంపై పోత్నాక్ ప్రమోద్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నేడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో సుమారు మూడు గంటల పాటు ఎజెండా అంశాలు చర్చకు రాకుండా అడ్డుకొని మున్సిపాలిటీలపై బ్యూరో కాట్ల పెద్దరికం నిర్మూలించాలని ప్రజలు కడుతున్నటువంటి పన్నుల రూపేనా వచ్చిన ప్రతి పైసా భువనగిరి పట్టణ పురపాలక సంఘంలోని స్లమ్ ఏరియాలతోపాటు వివిధ వార్డులలో అభివృద్ధి కోసం కేటాయించాలి తప్ప అధికారుల అవసరాలకు ఖర్చు చేయొద్దని ఏ విధమైనటువంటి ఆదాయం లేనటువంటి భువనగిరి మున్సిపాలిటీలోని డబ్బులను అధికారులు వారి యొక్క అవసరాల నిమిత్తం మళ్ళించడం పై భువనగిరి పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భం ఇట్టి విషయం ప్రధాన దినపత్రికలు అయినటువంటి అన్ని దినపత్రికలలో వచ్చిన సందర్భాన్ని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారని అధికారులకు వారి ఖర్చులకోసం ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉన్న ఖర్చు చేసుకోవాలని ఆలోచన చేయనటువంటి అధికారులు భువనగిరి పురపాలక సంఘంలోని సాధారణ నిధులను వాడుకోవడం ఎంతవరకు సమంజసమని పాలకవర్గాన్ని అధికారులను కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీయడం జరిగింది
టి యు ఎస్ ఐ డి సి పథకం ద్వారా ఎస్టిమేషన్లు చేసినటువంటి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు సంబంధించి మున్సిపల్ సాధారణ నిధుల నుండి పెట్టి వెచ్చించిన డబ్బులు ఎన్ని తిరిగి రిటర్న్ కార్యాలయానికి వచ్చాయని మరియు ఈ ఎజెండా అంశంలో చేర్చినటువంటి 28 మంది అదనపు కార్మికులను ఎంచుకునే విధానంపై పాలక పక్షానికి పూర్తిగా అధికారం ఇవ్వాలని గౌరవ కౌన్సిలర్లకు గౌరవం ఉండాలని మరియు 35 వ వార్డు పరిధిలో ఉన్నటువంటి కమాన్ రోడ్డును 19వ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీలోని మట్టి పూడికతను 20వ వార్డులో 20 మీటర్ల పొడవు గల పెద్ద డ్రైన్ ను 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా వచ్చే నెల సమావేశం వరకు ఎజెండా అంశాల్లో చేర్చే విధంగా భువనగిరి పట్టణ పరిధిలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను తీర్చి ప్రజలను ఆదుకోవడం కోసం రానున్నటువంటి కౌన్సిల్ సాధారణ సమావేశంలోని ఎజెండాలో చేర్చే విధంగా హెచ్ఎండిఏ ప్రత్యేక నిధులు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని రాజకీయాల కతీతంగా సామాజిక ఉద్యమంగా చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది