సంక్షేమమే టిఆర్ఎస్ లక్ష్యం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జూలై 28 రాయల్ పోస్ట్ ప్రతినిధి: ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ నైజాం అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు, గురువారం పట్టణంలోని ఏర్పాటుచేసిన షే ట్ కార్ ఫంక్షన్ హాల్లో, సిర్గాపూర్, నాగలిగిద్దా, మండలాల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు, పార్టీకి నిజమైన బలం కార్యకర్తలని వారి కృషితోనే నారాయణఖేడ్, నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాలు సాధిస్తుంది అన్నారు, అన్ని మండలాల ఎంపీపీ లను, జెడ్పిటిసిలను, కైవాసం చేసుకోవడంలో, కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించారు అన్నారు, గత పాలకులు నారాయణఖేడ్ ను దోచుకుని దాచుకోవడం ,
నేర్చుకున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది అన్నారు, బిజెపి లీడర్లు అబద్ధాలు మాట్లాడుతూ కాలం వల్ల తీరుస్తున్నారని, తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు సెంట్రల్ ఫండ్స్ ఇస్తున్నప్పుడు, వారు పాలిస్తున్న కర్ణాటకలో ఈ స్కీమ్స్ ఎందుకు లేవని ప్రశ్నించారు, ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి ,జెడ్పిటిసి రాఘవరెడ్డి, నాగలగిద్ద ఎంపీపీ మోతి బై రాథోడ్, జెడ్పిటిసి రాజు రాథోడ్, వివిధ మండలాల అధ్యక్షులు, సంజీవ్, పండరి యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.