యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం రాయల్ పోస్ట్ న్యూస్ జులై 28

తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మపూర్ గ్రామంలో ని పొట్టిమర్రి తండాలో సీత్లా పండుగ జరుపుకోవడం జరిగింది
లంబాడీల సాంప్రదాయ వేడుక ఘనంగా సంబరాలు
ఆనవాయితీగా జూలై నెలలో లంబాడి గిరిజనలు సీత్లా, పండుగను సాంప్రదాయం బద్దంగా జరుపుకుంటారు ఏడుగురు అమ్మవారును కొలిచి పండుగ సీత్లా భవాని పూజ లంబాడి గిరిజనులు ఏడుగురు దేవతలోని చిన్న దేవతలైన సీత్లా’భవాని మాతను పూజించడం పూర్వకాలం వస్తుంది
పశువులను రోగాలు రాకుండా రక్షించాలని పంటలు సమర్థింగా పండాలని వేడుకుంటారు సీత్లా భవాని మాతకు లంబాడి గిరిజనలు ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీ వస్తుంది ఆషాడ మాసంలో గిరిజన తండాలో వైభవంగా జరుపుకుంటారు
తండాల పొలిమేర వద్ద గాని చెరువుగట్టుపైన చెట్టు కింద ఏడుగురు దేవతలను పాటు దేవతాలకు ఎదురుగా “లంకడియా”ప్రతిస్తారు జొన్నలు పప్పు శనగలు ధాన్యాలను నానబెట్టిన మొక్కజొన్నలు నైవేద్యంగా ఇంటి వద్దనే తయారు చేసుకుని బోనంతో పాటు పసుపు కుంకుమ నీళ్లతో యువతులు మహిళలు సామూహికంగా బయలుదేరి డప్పుల వాయి ధ్యలతో సీత్లా దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా కోళ్లు మేకలు గొర్రెలను దేవతల చుట్టూ ప్రదక్షణలు చేయించి బలిస్తారు తండాల్లో పశువులన్నిటిని ఒకచోట చేర్చి దేవతలకు బలి నిచ్చిన మేకల పేగులను మీదుగా దాటిస్తారు. *బంజారా సీత్లా భవాని పండుగ ఘనంగా జరుపుకుంటారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.