తమ హక్కుల కోసం నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న సిపిఎం బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం


రాయల్ పోస్ట్ న్యూస్/ ఎన్నికల ముందు వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేస్కేల్ జీవో తీసుకొస్తామని చెప్పి నమ్మబలికిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత వాటి ఊసి మర్చిపోయారని గత నాలుగు రోజులుగా వీఆర్ఏలు అన్ని
ఏర్పడి ఉద్యమం కొనసాగిస్తున్నాయని అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వెంటనే ప్రభుత్వం కల్పించుకొని వీఆర్ఏల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు 55 సంవత్సరము నిండిన వీఆర్ఏలకు కుటుంబసభ్యులకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని వీఆర్ఏలకు పై పని భారాన్ని తగ్గించాలని కోరారు కార్మికుల కోసం చట్టాలు చేస్తున్న మన ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి ప్రవర్తించడం రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధమని చట్ట ప్రకారం వీఆర్ఏలకు పేస్కేల్ జీవో ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ


కార్యక్రమంలో లక్ష్మయ్య రమేష్ ఎల్లయ్య బ్రహ్మచారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు