గురుకుల హాస్టల్ ను సందర్శించిన NSUI జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్

రాయల్ పోస్ట్ న్యూస్/యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న గురుకుల హాస్టల్ ను NSUI నాయకులు సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీ లో భోజనం బాగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఒక విద్యార్థి మరణించారు. అందుకు ఈరోజు నుండి జిల్లాలోని హాస్టల్లలో భోజన వసతులు సరిగా ఉన్నాయా లేవా అని రోజుకొక హాస్టల్ ను సందర్శించి పరిశీలించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల హాస్టల్ ను సందర్శించి భోజన వసతులను పరిశీలించడం జరిగింది. విద్యార్థుల పట్ల భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రతి హాస్టల్లో వార్డెన్, డాక్టర్ స్థానికంగా ఉండేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, NSUI నాయకులు కొండోజు సాయి, మోతే మనోహర్, మంగ ఉదయ్, అసద్, నాగరాజు, తేజ, నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.