*ఆర్డీఓ కార్యాలయం టాయిలెట్లు ఇంత దరిద్రంగానా..!?

రాయల్ పోస్ట్ ప్రతినిధి 28 జూలై కంది మండల్ సంగారెడ్డి

సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో మరుగుదొడ్లు మరీ అధ్వాన్నంగా తయారయ్యాయి. టాయిలెట్ లోనికి వెళ్లాలంటే కంపు వాసన వస్తుంది. టాయిలెట్లు మొత్తం నాచు , చెత్తా చెదారంతో నిండిపోయాయి. టాయిలెట్లను శుభం చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇంత దరిద్రంగా టాయిలెట్లు ఉన్నా వాటినే వాడుతున్నారు తప్ప బాగు చేయించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వేలు , లక్షల్లో జీతాలు తీసుకునే రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అధికారులు , సిబ్బంది ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఏది ఎలా ఉంటే మాకెందుకు లే.. అన్నా దోరణితో వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. అసలే వర్షా కాలం ..సీజనల్ వ్యాధులతో అల్లాడిపోయే పరిస్థితి. మరో మళ్లీ విబృంభిస్తున్న కరోనా. ఇంత జరిగినా ఆర్డీఓ కార్యాలయం వాళ్లు మాత్రం లైట్ తీసుకుంటుండటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఇలాంటి టాయిలెట్లను వాడుకోవడం మా ఖర్మ అంటూ ఉద్యోగులు ఊసురుమంటున్నారు.