అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్ రావు

రాయల్ పోస్ట్ న్యూస్/ భారత రాష్ట్రపతి, ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ముని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరిని ఖండిస్తూ బిజెపి ఎస్,సి మోర్చా భువనగిరి పట్టణ అధ్యక్షులు ఎరుపుల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వినాయక చౌరస్తాలో సోనియా గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ శ్యామ్ సుందర్ రావు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కించపరిచే విధంగా మాట్లాడినందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఆదివాసి మహిళా అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థి కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయిందని, ఆదివాసి మహిళ అయినా ద్రౌపది ముర్మకు దేశ వ్యాప్తంగా అనేక పార్టీలు మద్దతునిచ్చి ఆమె విజయానికి సహకరించాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదివాసి మహిళకు మద్దతివ్వకుండా రాజకీయాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. నేడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్ర‌మాణ‌ స్వీకారం చేసిన వెంటనే పార్లమెంటులో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత చే రాష్ట్రపతి పై అర్థరహిత వ్యాఖ్యలు చేయించిందని, ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కుసంస్కరానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ సభ్యుడి హోదాలోఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాష్ట్రపతి గురించి సోయుండి మాట్లాడారా..? లేక వ్యంగంతో అగౌరపరచాలనే మాట్లాడారా ..? రాష్ట్రపతి పేరును అగౌరవ పరిచే విధంగా, అసభ్యకరంగా సంబోధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహిళగా సాటి గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే ఆ పార్టీ తరపున ఇచ్చే గౌరవం ఇదేనా ..? ఆదివాసి మహిళ పై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో ఆ పార్టీకి గిరిజనులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, రాష్ట్రపతికి, దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కసం వెంకటేశ్వర్లు, పాశం భాస్కర్,దాసరి మలేశం పీస్ రవీందర్,దనజయ్య, పట్టణ అధ్యక్షుడు పాదరాజు ఉమ శంకర్ రావు నాయకులు,నర్ల నరసింగరావు, మాయ దశరథ, నీలం రమేష్, జనగామ కవిత నరసింహ చారి,రత్నపురం బలరాం,పంచేందుల బలరాం,పట్నం కపిల్, సుధాకర్,ఉపేందర్,దిలీప్,రాజేష్, తదితరులు పాల్గొన్నారు