ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి సి,ఐ,టియు, కొల్లూరి ఆంజనేయులు డిమాండ్
యాదాద్రి భువనగిరి: రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి: మోట కొండూరు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో
అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి……
కొల్లూరు ఆంజనేయులు
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్……
వీఆర్ఏలు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని మోటకొండూరు మండల తాసిల్దార్ ఆఫీస్ ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈరోజు మోటకొండూరు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో వీఆర్ఏల సమ్మెకు పూర్తి సంఘీభావం తెలియడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో కొల్లురు ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2017 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను అమలు చేస్తానని చెప్పి నేటికీ అమలు చేయలేదని వీఆర్ఏల పట్ల మొండి వైఖరి వీడి సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు చాలీచాలని జీతాలతో సతమతం అవుతు కుటుంబం గడపలేక కష్టంగా మారి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నారని రెండు సంవత్సరాలుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా వెట్టిచాకి చేస్తున్నారని జాబ్ చాట్ లో లేని పనులు చెబుతూ అధికారులు వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఎమ్మార్వో ఆఫీస్ లో నైట్ వాచ్మెన్ గా డ్యూటీలు కూడా వేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. 50 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అర్వత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సిఐటియు మోటకొండూరు మండలకమిటీ పూర్తిగా అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
ఈ సమ్మెలో పాల్గొన్నవారు వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పప్పుల అనిల్ కుమార్, మత్స్యగిరి ఎం నరేందర్ కందారపు గణేష్, ఎస్ సుకన్య ,డి ఝాన్సీ, ఏ అనిత, డి కవిత, ఐలయ్య, రమేష్, బందెల అంజయ్య, బందెల మొగులయ్య, పాండు, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.