ప్రేమ విఫలమైందని రామాయంపేటలో యువకుడు ఆత్మహత్య

రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా ప్రతినిధి

ప్రేమ విఫలమైందని ఒక యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట లో చోటుచేసుకుంది.ధర్మకర్ శివకుమార్(21) అనే యువకుడు మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. ఈ రోజు రామాయంపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి బంధువులు తెలిపారు.రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి దర్యాప్తుచేస్తున్నట్టు తెలిపారు.