ప్రభుత్వం ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుంది

రాయల్ పోస్ట్ ప్రతినిధి:- నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం,

ప్రజల ఇష్టప్రకారమే జిన్నారం మండలంలో నాలుగు గ్రామాలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి

రొయ్యపల్లి, శేర్ ఖాన్ పల్లి,నాగారం
అక్వాంచగూడెం,గ్రామాలను జిన్నారం మండలంలో కలపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారిని కలిసినా నాలుగు గ్రామల ఎంపిటిసి ఆగమయ్యా, సర్పంచులు కనిగేరి లక్ష్మీనారాయణ ముదిరాజ్, విజయ లక్ష్మి విట్టల్, యశోద,ఉప సర్పంచ్ వెంకటేశం గౌడ్,మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, సిద్దుల ప్రభాకర్, నాగభూషణం గౌడ్,పోచగౌడ్, మన్నే శ్రీనివాస్,సారా విజయ్ కుమార్,వడ్ల వీరేష్ చారి, పోచా గౌడ్, అశోక్, రామకృష్ణ యాదవ్, కృష్ణ గౌడ్, పవన్ కుమార్, ప్రభాకర్ మరియు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయానికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని గ్రామాలు అభివృద్ధి చెందాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి కోరుకుంటూ, ప్రజల ఇష్టప్రకారమే జిన్నారం మండలం లో నాలుగు గ్రామాలు రొయ్యపల్లి, షేర్ ఖాన్ పల్లి, అక్వాంఛ గూడెం, నాగారం గ్రామాలను జిన్నారం మండలంలో కలుపుతామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు చెప్పారు. సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు.