కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

రాయల్ పోస్ట్ ప్రతినిధి/ చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామంలో కొఠారి వెంకటేష్(43) అనే వ్యక్తి కుటుం ఆ కలహాలతో ఇంట్లోని దూలనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు పోలీసుల కథనం ప్రకారం 17 సంవత్సరాల క్రితం కొత్తపల్లికి చెందిన అంజలితో వివాహం జరగగా 15,13 సంవత్సరాల పిల్లలు ఉన్నారు.గత రెండు సంవత్సరాల నుండి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండగా 8 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళింది.కూలి పనులు చేసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్న వెంకటేష్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు.ఈ రోజు సఫాయి కార్మికులు వెంకటేష్ ఇంటి వద్ద వీధి చెత్త తీయడానికి రాగా ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుందని కిటికీ వద్ద కు వెళ్లి చూడగా ఇంట్లోని దూలనికి ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడని మృతుని తండ్రికి తెలియచేశారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేగుంట యస్.ఐ ప్రకాష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.