కస్తూరిబా పాఠశాలలో అధ్వాన్నంగా విద్యార్థినిల పరిస్థితి

రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా ప్రతినిధి

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినిల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.సరుకులు సరఫరా చేసే ఏజెన్సీ లేకపోవడంతో ఉపాధ్యాయులకు సరుకుల సరఫరా బాధ్యత అప్పగించారు.వారు కూడా చేతులు ఎత్తివేయడంతో ప్రతి రోజు నీళ్లచారు,ఉడికిఉడకని భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు.ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో పాఠశాలలో 180 మంది విద్యార్థినిలు ఉండగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులకు చాలా మంది విద్యార్థులు ఇంటిబాట పట్టి కేవలం 25 మంది విద్యార్థినిలు మాత్రమే ఇక్కడ మిగిలారని,పలువురు విద్యార్థినిలు అస్వస్థకు గురైయ్యారని తెలిసింది.ఇకనైనా ఉన్నతాధికారులు పట్టించుకొని నాణ్యమైన భోజనం తో పాటు నాణ్యమైన విద్య అందించి,సరియైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినిల తల్లితండ్రులు కోరుతున్నారు.