ఆలేరు సాయిబాబా ఆలయంలో భారీ చోరీ
ఆలేరు జూలై 27 రాయల్ పోస్టు ప్రతినిధి…
ఆలేరు పట్టణంలోని హైదరాబాద్. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో మంగళవారం రోజున రాత్రి సమయంలో ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. స్థానిక ఎస్సై ఇద్రిస్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు పెద్ద వెండి సింహం బొమ్మలు. రెండు వెండి పల్లాలు మరియు పాదాలు. శివలింగం. శతగోపురం మరియు పాదాలు. శివలింగం. గుడి లోపల ఉన్న కౌంటర్లో గల సెల్ఫోన్ మరియు సుమారు 80 వేల నగదు దొంగిలించారని. అట్టి సొమ్ము విలువ రెండు లక్షల 73 వేల విలువ ఉంటుందని ఫిర్యాదు దారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు