ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

రాయల్ పోస్ట్ ప్రతినిధి పటాన్చెరువు నియోజకవర్గ
గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం లో జాతీయ రహదారిపై బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ పై వెళ్తున్న జుక్కల జహంగీర్ యాదవ్ ను వెనకాల నుండి బలంగా ఢీకొనడంతో జాంగిరి యాదవ్ అక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకృష్ణ తెలిపారు