సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మెను కొనసాగిస్తాము

రాయల్ పోస్ట్ ప్రతినిధి :సంగారెడ్డి జూలై 25
రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు జరిగే వరకు సమ్మె కొనసాగిస్తామని గ్రామ సేవకులు అన్నారు, అప్పులు మరియు సమస్యల సాధన కోసం జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నుండి రాసవ్యాప్తంగా గ్రామ సేవలకు సమ్మెకు దిగారు, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా సమ్మెను ప్రారంభించారు, నారాయణఖేడ్ తాసిల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సమ్మె సందర్భంగా జేఏసీ డివిజన్ అధ్యక్షులు ఖాజా మైనుద్దీన్ డివిజన్ మాట్లాడుతూ టు 2017 లో రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గ్రామ సేవలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు, పే స్కేలు అమలు చేస్తామని అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పిస్తామని, ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అని అన్నారు, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విధులకు హాజరయ్యే ది లేదు అన్నారు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి హామీలు అమలు చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సేవకులు బాలరాజు, లక్ష్మణ్ ,చోటు మియా, బీదయ్య మొగులయ్య రాజు మాణిక్యం , సంగమేశ్వరం సంజీవ్ రాములు సాయిలు తదితరులు పాల్గొన్నారు.