యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం రాయల్ పోస్ట్ న్యూస్ /జులై26
రైతులకు ఏకకాలంలో లక్షరూపాయలు మాఫీ చేయాలని బీజేపీ సంతకాల సేకరణ*
తుర్కపల్లి మండల కేంద్రంలో ల ఈరోజు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణ మాఫీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండో సార్లు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోవటం తీవ్రంగా ఖండిస్తూన్నామని రేపు జరగబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్ ,కిసామోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బోరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి,తుర్కపల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు దానబోయిన వెంకటేష్ ,ఆకుల భాస్కర్ ,ఎడవెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు..