ముస్లింల సంక్షేమానికి సర్కార్ కృషి

ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
ఆలేరు పట్టణంలో పీర్ల కొట్టం ప్రారంభం

హాజరైన ఎన్ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్/ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు పునర్దుటించారు. ఆలేరు పట్టణంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అబ్బాసి అలామ్ అశుర్ ఖానా ( పీర్ల ) కొట్టమును టెస్కబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గౌరవ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విప్ సునీతామహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ముస్లింల సాంప్రదాయాన్ని ప్రభుత్వం గౌరవించిందన్నారు. షాదీ ముబారక్ వంటి మహత్తర పథకానికి శ్రీకారం చుట్టి రూ. 18 సంవత్సరాలు నిండిన అడబిడ్డల వివాహాలకు 1,00,116 / – నగదు సాయం అందజేస్తుందన్నారు. మైనారిటీలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో వందలాది గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం నెలకొల్పిందని ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా మసీదుల మరమ్మతులకు, పీర్ల కొట్టాల నిర్మాణాలకు రూ. 2 కోట్ల 8 లక్షలు నిధులు మంజూరు చేశామని తెలిపారు. గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సముచిత గౌరవం, సంక్షేమం, ప్రాంత అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆమె తెలిపారు.

ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం : గొంగిడి మహేందర్ రెడ్డి

ఇమామ్, మౌజన్లకు నెలనెలా గౌరవ వేతనం అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని టెస్కబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గౌరవ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు అన్నారు. టీఆర్ఎస్ మతం, కులం ప్రతిపాదికన పని చేయదని, యావత్ ప్రజా సంక్షేమమే గౌరవ సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ గారు, మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ జూకంటి శ్రీకాంత్, టిఆర్ఎస్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, ముస్లిం మత పెద్దలు MD ఖాసిమ్, అబ్బాస్, నాసీరుద్దీన్, సాధిక్ తోపాటు నాయకులు షాబుద్దీన్, రియాజ్, ఆశు, ఫయాజ్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.