బ్రహ్మాకుమారీస్ పాల్వంచ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విక్టరి~దినోత్సవం

రాయల్ పోస్ట్ న్యూస్/కార్గిల్ అమరవీరుల త్యాగం వృధా పోదు
భారత్ సైన్యం సేవలు ప్రపంచానికే ఆదర్శం ,రాఖీ కట్టి ఆత్మీయత చాటిన~ పాల్వంచ బ్రహ్మాకుమారి పద్మజ

నేడు వీర మరణం పొందిన కార్గిల్ అమరవీరుల సంస్మరణ విక్టరి దినోత్సవం సందర్భంగా 6వ బెటాలియన్ స్పెషల్ పోలీస్ వారితో పాల్వంచ బ్రహ్మా కుమారీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు పద్మజ మాట్లాడుతూ
ఇప్పటివరకు పాకిస్తాన్ భారత్ మధ్య నాలుగు సార్లు జరిగిన యుద్ధంలో అత్యున్నతంగా చరిత్రలో అందరిని కలిచి వేసింది కార్గిల్ యుద్ధం.

పాకిస్తాన్ భారత భూభాగంలోకి చొచ్చుకొని దొంగతనంగా భారత ప్రాంతాన్ని ఆక్రమించాలనే దురుద్దేశంతో భారత్ సైన్యంపై దాడులు జరిపింది పాక్ సైన్యం.
ఆ యుద్ధంలో భారత్ సైన్యం వారిని తరిమి తరిమి కొట్టిన సమయం అది .
దాదాపు రెండున్నర నెలలు సాగిన ఆ యుద్ధంలో 527 మంది భారత్ సైన్యం 4000 మంది పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు . భారత్ సైన్యం సేవలు ,ధైర్య సాహసాలను యావత్ దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది . పోలీస్ సోదరులు దేశ ప్రజలకు రక్షణగా ఉన్నారు కాబట్టే నేడు ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తున్నారని పద్మజ వారిని అభినందించారు.
మీరు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే
మేడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యం అని అనేక రుగ్మతలను దూరం చేసేది ఒక్క మెడిటేషన్ మాత్రమే, కాబట్టి మీరందరూ తప్పని సరిగా మేడిటేషన్ సాధన ద్వారా మీరు మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండాలని , తద్వారా దేశానికి మరెంతో సేవలు అందించగలరని
బ్రహ్మాకుమారీస్ పాల్వంచ శాఖలో గత 22 సంవత్సరాలుగా ఉచితంగా మెడిటేషన్ నేర్పబడుతుందని ఉదయం, సాయంత్రం క్లాసులు ఉంటాయని నేర్చుకోవాలనుకునే వారు ఈ ఫోన్ నంబర్ కు 9246777886 కాల్ చేసి వివరాలు తెలుసుకుని ఈ అవకాశం తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

అనంతరం
ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్
శ్రీనివాస్ గారికి , ఇతర అధికారులకు సన్మానం చేసి ఈశ్వరీయ కానుకలు అందజేశారు , మరియు అధికారులందరికీ రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు తెలిపారు.

ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒక వ్యక్తి ఒక మొక్క ఒకే విశ్వం అనే ఉద్దేశంతో బ్రహ్మాకుమారీస్ కల్పతరూహ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ అవకాశం కల్పించిన కమాండెంట్ రమణ రెడ్డి గారికి అసిస్టెంట్
కమాండెంట్
శ్రీనివాస్ గారికి బ్రహ్మాకుమారి పద్మజ హృదపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ గౌ,సోదరులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ
బ్రహ్మాకుమారీల సేవలు ప్రపంచానికే ఆదర్శం. నిస్వార్థమైన సేవలు అందిస్తూ ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నారు. వారికి కులంతో, మతంతో ఎలాంటి సంబంధం ఉండదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆశిస్తూ ఎందరికో ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తున్న బ్రహ్మాకుమారీ పద్మజ ఈ చక్కటి కార్యక్రమం మాతో జరుపుకోవడం మా సేవలను గుర్తించి ఇక్కడకు విచ్చేసి ఎంతో ప్రేమతో మాకు మా సిబ్బందికి రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసి బ్రహ్మాకుమారీ పద్మజ గారిని సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో కమాంటెంట్లు సీతారాం , కాళిదాస్ ,R.I, GV రామారావు, RSI లు, బెటాలియన్ సిబ్బంది మరియు BK సభ్యులు స్పందన, కమల పాల్గొన్నారు.