*పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల,జిన్నారం, పటాన్చెరు మండలాల్లోనీ 13 గ్రామాల్లో బోనాల పండుగల్లో పాల్గొన్న తెరాస రాష్ట్ర నాయకులు నీల మధు ముదిరాజ్ *

రాయల్ పోస్ట్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో గ్రామ, గ్రామాన బోనాల ఉత్సవాలు గ్రామస్తులు, నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారని తెరాస రాష్ట్ర నాయకులు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం నల్లవెల్లి, అనంతారం, దోమడుగు, బొంతపల్లి, వీరన్న గూడెం, జిన్నారం మండల పరిధిలోని ఊట్ల, శివానగర్, లక్ష్మీపతి గూడెం, గడ్డపోతారం, అమీన్పూర్ మండలం గండెగూడ, గండెగూడ కాలనీ, దయారా, పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాయితేజ కాలనీ, లక్డారం గ్రామాల్లో నిర్వహించిన బోనాల మహోత్సవంలో తెరాస రాష్ట్ర నాయకులు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్ ను ఘనంగా సత్కరించారు రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే కేసీఆర్ పాలనే అని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు పేద ప్రజలకు సైతం అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి కన్న బిడ్డల్లా చూసుకుంటున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. సంస్కృతులు, సంప్రదాయాలు గౌరవిస్తున్నది దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో మరింత అభివృద్ధి జరుగుతాదని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్,సర్పంచ్ లావణ్య జీవన్, రాజశేఖర్, దీపా నరేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ కుమార్, కొరివి శంకర్,వార్డు సభ్యులు కృష్ణ, సత్యనారాయణ,సుధాకర్ రెడ్డి, వీరేశం,వినోద్,బిక్షపతి,హరికృష్ణ, గారెల మల్లేష్, కొరివి బిక్షపతి, బాలరాజు గౌడ్,పుల్లగిరి శ్రీనివాస్ , బాలరాజు, రాములు, గువ్వల వెంకటేష్, నర్సింలు, జీతయ్య,నారా బోయిన శ్రీనివాస్, జింక గోపాల్, వీరేష్,శ్రీకాంత్ గౌడ్,బాబు,భావాని రమేష్,పట్నం శ్రీను,ఆంజనేయులు,సుకుంకరబొన మహేష్,వీరల సత్యనారాయణ,శ్రీను,శ్రీకాంత్, సాయి, మహేందర్, లక్ష్మణ్,గ్రామ పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మూడు మండలాల NMR యువసేన సభ్యులు పాల్గొన్నారు.