పిల్లలు తాగే పాలను కూడా వదలరా…
– కొండమడుగు నర్సింహ
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ దేశంలో కోట్లాదిమంది పిల్లలకు ఆహారమైన పాలపై కూడా జీఎస్టీ వేయడం చాలా దారుణమని, పిల్లలు తాగే పాలను కూడా వదలరా అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రశ్నించినారు. ఆదివారం మండల పరిధిలోని బస్వాపురం, హన్మాపురం, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలలో సిపిఎం ఆయా గ్రామ శాఖల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు, బౌలజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాద దేశాలకు భారత దేశాన్ని తాకట్టు పెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ ప్రజలపైన అనేక రకాలైన భారాలు మోపుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల అధికారాలను కొల్లగొడుతూ కొత్త కొత్త విధానాలు చేస్తూ ప్రజల పైన భారాలు మోపుతున్నారని కొత్త రకంగా జీఎస్టీ విధానం తెచ్చి పాలు, పెరుగు, పన్నీరు, నెయ్యి,పిండి పదార్థాలు, తేనే,చేపలు, మాంసం, బియ్యము, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, హాస్పటల్ బెడ్లు, సోలార్ వాటర్ హీటర్స్,ఇంక్, పెన్సిల్స్, పుస్తకాలు, ఎల్ఈడి దీపాలు, స్మశాన వాటికలపై ప్రజలు వాడే ప్రతి వస్తువుపై 5 శాతం నుండి 18 శాతం వరకు పెంచి ప్రజల జీవన పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తుందని, సామాన్య మానవుడు, పేదలు బిజెపి విధానాల వల్ల జీవించే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం జీఎస్టీని వెంటనే విరమించుకోవాలని నర్సింహ డిమాండ్ చేసినారు. సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ నీ అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజల ఆందోళన చూసన్న విరమించుకోవాలని అన్నారు. ప్రతి వస్తువు పైన జిఎస్టి విధించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని ఆవేదన వెలిబుచ్చారు. బిజెపి ప్రభుత్వం జీఎస్టీ విరమించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కార్యదర్శివర్గ సభ్యులు కూకుట్ల కృష్ణ, కొండ అశోక్, హన్మాపురం గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, బస్వాపురం గ్రామ శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, ముత్తిరెడ్డిగూడెం గ్రామ శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, ఆయా గ్రామాలకు సంబంధించిన సిపిఎం కార్యకర్తలు, ఉడుత వెంకటేష్, తెల్జూరి మాణిక్యం, రైతులు, గ్రామప్రజలు, వృత్తిదారులు గౌటి సతీష్, రాంపల్లి వెంకటేష్, బబ్బురి కృష్ణ, కొండ మల్లేష్, కూకుట్ల చిన్న బొజ్జయ్య, నోములు కొమరయ్య, జక్కుల నర్సింహ, శెట్టి వెంకటేష్, తోటకూరి రాజు, పర్షబోయిన వెంకటేష్, కొండమడుగు అయిలయ్య, బొజ్జ మదు,బొజ్జ లచ్చల్, మెరుగు ఎల్లం, ఏనుగు చిన్న లింగారెడ్డి, ఎర్రబోయిన అంజయ్య, నాగపూర్ చంద్రయ్య, మూడుగుల ఉపేందర్, రాసాల శేఖర్, మచ్చ వెంకటయ్య, ఉడుత సత్యనారాయణ ఉడత సత్యనారాయణ, మచ్చ నారాయణ, నోముల రామయ్య, రాసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.