రాయల్ పోస్ట్ న్యూస్/ దళిత సాహిత్యానికి ఆద్యుడు గుర్రం జాషువా. దళిత సాహిత్యానికి ఆద్యుడు గుర్రం జాషువా అని రచయిత, సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కాచరాజు మిని హాల్ లో జరిగిన గుర్రం జాషువా 51 వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గుర్రం జాషువా తన జీవితాంతం కుల నిర్మూలనకు కృషి చేసే రచనలు రాసాడని గుర్తు చేశారు. భారత దేశంలో కులాలు, మతాలు ఆధిపత్యం చేస్తున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది కవులు రచనల ద్వారా వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మనందరికీ ఆదర్శం కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ భువనగిరి సభ్యులు కాచరాజు జయప్రకాష్, రామ్మూర్తి, శ్రీనివాసాచార్యులు,జిట్టా భాస్కర్ రెడ్డి, వైజయంతి, రమేష్,మైనోద్దీన్, ప్రవీణ్ కుమార్, కొడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.