గిర్మాపూర్ వార్డులో నిర్వహించిన బోనాల సందర్భంగా స్థానిక కౌన్సిలర్ లావణ్య రెడ్డి రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని భారతదేశంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బిన్నవైనవని మరియు ఇక్కడి ప్రజలు ప్రకృతి ఆరాదకులు అని,అందులో భాగంగా ఏటా వివిధ ఋతువులకు అనుగుణంగా దేవతలను ఆరాదరిస్తారు అని,వేసవి కాలం నుండి వర్షాకాలం ప్రారంభం అవ్వగానే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుంది,కాబట్టి ఆయా వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని,వర్షాలు సక్రమంగా కురిపించాలి అని ప్రతి సంవత్సరం అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరుగుతుంది అని మేడ్చల్ మాజీ సర్పంచ్ నర్సింహ రెడ్డి. పేర్కొన్నారు.ఆదివారం గిర్మాపూర్ వార్డులో నిర్వహించిన బోనాల సందర్భంగా స్థానిక కౌన్సిలర్ లావణ్య హన్మంత్ రెడ్డి తో కలిసి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి,నాయకులు నర్సింహ రెడ్డి,శేఖర్ గౌడ్,హన్మంత్ రెడ్డి,వంగేటి రాజిరెడ్డి,రాఘవ రెడ్డి,మహేష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.