కేటీఆర్ ను సల్లంగా సూడు స్వామీ

యాదాద్రీశుడికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి పూజలు
ఆయన కృషితోనే రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు అని ప్రశంస

యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

రాయల్ పోస్ట్ న్యూస్/ టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ & మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు ( కేటీఆర్ ) జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు ఆదివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్ గారి పేరు మీదుగా అష్టోత్తర పూజ జరిపించారు. స్వల్పంగా కాలి గాయానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటిఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆమె మొక్కుకున్నారు. కేటీఆర్ గారి ముందు చూపుతో రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కిందని, ఆయన వాక్పటిమతో వివిధ దేశాల నుంచి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయని అన్నారు. ఒక్క పక్క సంక్షేమం, మరో పక్క ఉపాధి కల్పనకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని, టి – హాబ్, టిఎస్ఐపాస్ వంటివి ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. అనంతరం కొండ దిగువన వైకుంఠ ద్వారం చెంత టిఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన కేటిఆర్ జన్మదిన కేక్ ను విప్ సునీతామహేందర్ రెడ్డి గారు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య గారు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకుల సుధాహేమేందర్ గౌడ్ గారు, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య గారు, చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్యగారు, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం గారు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య గారు తదితరులతో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయికలు పాల్గొన్నారు.