రాయల్ పోస్ట్ న్యూస్/ బిజెపి ఎస్సీ మోర్చ పట్టణ సమావేశం అద్యక్షుడు పస్తం ఆంజనేయులు అధ్వర్యంలో ఆలేరు బిజెపి కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేముల నరేశ్ ఇంఛార్జి కడియం కల్యాణ్ చందర్ మాట్లాడుతూ అలేరు పట్టణంలో దళితుల భూములు తెరాసా నాయకులు యదేచ్చగా దళితుల భూములు కబ్జా చేస్తున్నారని భుబాధితుల కుటుంబాలకు బిజేపీ అండగా నిలుస్తుందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మేల్యే గారు బాధితులకు న్యాయం చేయాలని లేదంటే బిజేపీ పార్టీ దళితుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తునికి దశరథ,5th వార్డ్ కౌన్సిలర్ సంగు భూపతి,పట్టణ ప్రధాన కార్యదర్శి కటకం రాజు,పట్టణ ఉపాధ్యక్షులు జెట్ట సిద్దులు,ఎలగందుల రమేష్, కళ్లెం రాజు, శరత్, కార్యదర్శి అయిలి సందీప్, మరియు దయ్యాల సంపత్, శివకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు