రాయల్ పోస్ట్ న్యూస్/ హైదరబాద్ మాదన్నపేట్ లో గల శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయ అమ్మవారికి పోలీసు విభాగం తరపున సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య పట్టు వస్త్రాలు సమర్పించారు. మాదన్నపేట్ పోలీసు స్టేషన్ నుంచి డిసిపి పోలీసు బృందం తో డప్పు సన్నాయిలతో దేవాలయానికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం దేవాలయ ప్రతినిధులు డిసిపిని శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ పాతబస్తి మత సామరస్యానికి ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదన్నపేట్ సిఐ సంతోష్ కుమార్, దేవాలయ ప్రతినిధులు రాచురి మల్లేశం, తంగేళ్ల సుధీర్, మహేష్, శ్రీనాథ్, శ్రీకాంత్, ఉగాది మహేష్, బాబు, అరవింద్ ప్రవీణ్, జనపాల మధు, గుంటి ధరమ్ వీర్, శశాంక్, మనీష్, ప్రకాష్, ప్రేమ తదితరులు పాల్గొన్నారు