నిలబడదాం పోరాడుదాం జర్నలిస్టుల సమస్యలను సాధిద్దాం
ఆగస్టు నెలలో జాతీయ మహాసభకు వేలాదిగా జర్నలిస్టు లు తరలిరావాలి

టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టుల బ్రతుకులకు ఏమి మారలేదని కాకపోగ ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరింపులు కేసులు దాడులు పెరిగాయని టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ ఆరోపించారు.
ఆగస్టు నెలలో జాతీయ సమావేశాన్ని విజయవంతం చేయడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్థానిక యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్ లో సన్నాక సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు షానుర్ బాబా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీ జె యు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, ఐఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ, రాష్ట్ర ఉాధ్యక్షులు రమేష్, రాష్ట్రప్రధాన కార్యదర్శి బింగి స్వామి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను ఆనించి వేసే కుట్రలో భాగంగానే దాడులకు తెగబడుతుందని అన్నారు. ఇకనుండి జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
స్వరాష్ట్రంలోనే జర్నలిస్టులకు హక్కులు ప్రభుత్వం కాలరాస్తుందని ప్రభుత్వాన్ని జర్నలిస్టులు హక్కులను యాచించడం కంటే నిలబడి పోరాడి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కానీ ఇవ్వలేదని నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన నిస్వార్ధంగా ప్రజలకు సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కల్పించలేక పోయిందని అన్నారు.
కొన్ని పత్రికల యజమాన్యాలు ప్రభుత్వంతో లాలూచి కొనసాగించడంతో జర్నలిస్టులపై చిన్నచూపు చూస్తుందని అన్నారు. పేరుకు మాత్రమే కొన్ని యూనియన్లు పనిచేస్తున్నాయని జర్నలిస్టుల ప్రజా సమస్యలపై మొద్దు నిద్రపోతున్నాయని దీనివలన జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని ఈ విధానాన్ని మార్చుకోవాలని కోరారు.
చిన్న పత్రికలకు మ్యాగజిన్ లకు నెల నెల ప్రభుత్వ ప్రకటనలు లక్ష రూపాయల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు చివరి వారంలో జాతీయ సమావేశానికి 29 రాష్ట్రాల నుండి జర్నలిస్టుల ప్రతినిధులు హాజరవుతున్నట్లు సమావేశానికి కేంద్ర మంత్రులు గవర్నర్లు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా నుండి మహాసభకు భారీ ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు కు డిమాండ్లను పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరపాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏ వ్యవస్థను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఇది సరైన పద్ధతి కాదని వారి న్యాయమైన హక్కుల కోసం టీజేయు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో టీ జె యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజా పసివుద్దీన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపారాజు వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దం ఉదయ్ రెడ్డి, గౌర అధ్యక్షుడు చిన్న బత్తిని, మత్యాస్, ఉపాధ్యక్షులు రషీద్,చీప్ సెక్రెటరీ సుక్క అశోక్, జిల్లా అధికార ప్రతినిధి లింగా నాయక్, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు రాజు, బాలయ్య, పిట్టల రమేష్, ప్రచార కార్యదర్శి సిరిల్ బాబు,
జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, అరుణ,
వివిధ జిల్లాల మండల కార్యదర్శులు అధ్యక్షులు
జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.