రాజ్ న్యూస్ జర్నలిస్టుపై దాడి
చేయడం సిగ్గుచేటు
..టీజేయు యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాపూరావు

, రాయల్ పోస్ట్ ప్రతినిధి కామారెడ్డి/ వార్తల కవరేజ్ కోసం వెళ్లిన రాజ్ న్యూస్ జర్నలిస్టుపై టిఆర్ఎస్ నాయకులు దాడి
చేయడం సిగ్గుచేటని టీజేయు యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాపురావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత మూడు రోజుల క్రితం బాన్స్ వాడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన రాజ్ న్యూస్ స్టాప్ రిపోర్టర్ మరియు బాన్సువాడ స్టింగర్ పై తెరాస కార్యకర్తలు నాయకులు దాడికి పాల్పడడం జరిగిందన్నారు. జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. దాడికి యత్నించిన తెరస కార్యకర్తలు వెంటనే మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల బాన్స్ వాడ తెరస పార్టీ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుక్కల రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నరేష్ నాయక్ ,జిల్లా కార్యదర్శి కిరణ్, జిల్లా క్యాషియర్ వడ్ల రాజేందర్, గోపాల్, రాజమౌళి, శ్రీకాంత్, కలీం, సుభాష్ నాయక్, ప్రసాద్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.