రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా ప్రతినిధి

తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

తమ అసైన్డ్ భూమిని ఇతరులు ఆక్రమించి పట్టా చేసుకున్నారని ఆవేదన తో మనస్తాపం చెంది తహసిల్దార్ కార్యాలయం ముందు ఓ మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో జరిగింది. చేగుంట మండలం పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన షహజాది బేగం సర్వే నంబర్ 464లో తనకున్న 6 ఎకరాల భూమిని హైదరాబాద్ కు చెందిన జగన్మోహన్ రెడ్డికి 2006 వ సంవత్సరం లో విక్రయించారు. అయితే తనకు కేవలం పట్టా భూమి కావాలని అసైన్డు భూమి వద్దు నా డబ్బులు నాకు ఇవ్వాలంటూ జగన్మోహనరెడ్డి కి అడగగా తాము డబ్బులు చెల్లించినప్పుడే తమ భూమిని తమకు అప్పజెప్పాలని షహజాది బేగం కొడుకు హుస్సేన్,కోడలు సాబేరా ఒప్పందం చేసుకున్నారు.ఇటీవల రెండు లక్షల రూపాయలను జగన్మోహన్రెడ్డికి చెల్లించి తమ భూమి తమకు కావాలని కోరగా గ్రామంలో ఉన్న భూమిని దున్నుకోవాలని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు వారి నాట్లు వేయడం కోసం ప్రయత్నం చేయగా గ్రామ ప్రజాప్రతినిధి నాగభూషణం అనే వ్యక్తి సాబేరా వేసిన వారి నాటును ట్రాక్టర్లతో దున్నశారు. ఈ విషయమై చేగుంట పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయగా గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి నాగభూషణం అనే వ్యక్తి తన తల్లి సత్తెమ్మ పేరు మీద పట్టా మార్పిడి చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు సైతం మీ పేరు మీద భూమి లేదు మేము ఏమి చేయలేమంటూ చెప్పడంతో సోమవారం చేగుంట తహసిల్దార్ కార్యాలయ సవరణకు చేరుకున్నారు. తహసిల్దార్ లక్ష్మణ్ బాబుకు తమ భూమి అక్రమంగా పట్టా చేయించుకున్నారని పేర్కొంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందును సాబేరా సేవించి కింద పడిపోయింది.వెంటనే పురుగుల మందు సేవించిన సాబేరాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్థానిక డాక్టర్ పుష్పలత ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారులు తమ స్వంత వాహనంలో మెదక్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.