జర్నలిస్ట్ జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలి;

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/
యాదాద్రి భువనగిరి జిల్లా; విధి నిర్వహణలో వరదల్లో చిక్కుకొని మృతి చెందిన జగిత్యాల జిల్లా ఎన్ టివి రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వెలిమినేటి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్సు చౌరస్తాలో జర్నలిస్ట్ జమీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒక నిమిషం మౌనం పాటించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ జమీర్ కుటుంబానికి రూపాయలు 20 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని, కుటుంబంలోని భార్య లేదా కుటుంబంలోని వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగము కల్పించాలని, ఇద్దరు చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలు సంభవించినప్పుడు కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులకు భద్రత కోసం రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోయే జర్నలిస్టు కుటుంబా లను కచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరాఠీ రవి, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశం, పట్టణ శాఖ అధ్యక్షుడు పోతంశెట్టి కరుణాకర్, సీనియర్ జర్నలిస్టులు చెన్నయ్య, కందుల శ్రీనివాస్, నరసింహ చారి, బుగ్గ శ్రీనివాస్, నరేందర్, కిషన్, కుమార్, శ్రీనివాస్ ,నరసింహ, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.